Home > క్రీడలు > IND vs ENG: సరికొత్త చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా జోడీ

IND vs ENG: సరికొత్త చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా జోడీ

IND vs ENG: సరికొత్త చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా జోడీ
X

ఆసియా ఖండంలో టెస్ట్ సిరీస్ అంటే.. దాదాపుగా స్పిన్నర్లదే హవా ఉంటుంది. కొన్నేళ్లుగా టీమిండియా స్పిన్నర్లే రాజ్యమేలుతున్నారు. ఇదివరకు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్.. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా. బైలింగ్ యూనిట్ ను తమ భుజాలపై వేసుకుని జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. వీళ్ల జోడీ జట్టులో ఉంటే కచ్చితంగా మ్యాచ్ ను మలుపుతిప్పుతారనే ధీమా. ఈ క్రమంలో జోడీలు నెలకొల్పిన రికార్డులు అనేకం. అశ్విన్, జడేజా జోడీ గత 12 ఏళ్లుగా జట్టును ముందుకు తీసుకెళ్తున్న వీరు.. తాజాగా ఓ రికార్డ్ ను బద్దలు కొట్టారు. భారత స్పిన్ దిగ్గజాలు కుంబ్లే, హర్భజన్ లను అధిగమించారు. భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన జోడీగా నిలిచారు.

అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లు 54 మ్యాచుల్లో 501 వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పై 6 వికెట్లు పడగొట్టి.. మొత్తం 53 వికెట్లు తీసుకున్నారు. దీంతో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ల రికార్డ్ ను వీరిద్దరు అధిగమించారు. కాగా మొదటి స్థానంలో ఇంగ్లాండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లు ఉన్నారు. వీరి జోడీ 138 టెస్టు మ్యాచుల్లో 1039 వికెట్లు పడగొట్టి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే, ఇటీవలే బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. వీరి జోడీకి బ్రేక్ పడింది. రెండో స్థానంలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ లు ఉన్నారు. వీరి జోడీ 81 టెస్టుల్లో 643 వికెట్లు పడగొట్టారు.




Updated : 25 Jan 2024 3:23 PM IST
Tags:    
Next Story
Share it
Top