అశ్విన్ నోట రిటైర్మెంట్ మాట.. ఎమోషనల్ అవుతూ..!
X
టీమిండియాకు దక్కిన టాప్ బెస్ట్ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. కుంబ్లే, హర్బజన్ తర్వాత ఆ స్థాయిలో.. క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. కెరీర్ ప్రారంభంలో ఏ ఫామ్ లో ఉన్నాడో.. ఇప్పుడూ అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ స్థనంలో కొనసాగుతున్నాడు. అయితే, తాజాగా జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. ప్లేయింగ్ లెవన్ లో అశ్విన్ లేకపోవడంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆసీస్ ను ముప్పు తిప్పలు పెట్టగల బౌలర్, పిచ్ కండీషన్ తగ్గట్టు స్పిన్ చేయగల అశ్విన్ ను ఎందుకు పక్కన పెట్టారని బీసీసీఐ పై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. అశ్విన్ తాజాగా తన రిటైర్మెంట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
‘బంగ్లాదేశ్ టూర్ నుంచి తిరిగొచ్చాక.. మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డా. నా భార్యతోనూ ఇదే విషయం చెప్పా. ఆస్ట్రేలియా సిరీస్ నా కెరీర్‌కు లాస్ట్‌ది అని వివరించా. మెకాలి గాయంతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నట్లు నా భార్యకు చెప్పా’ అని అశ్విన్ అన్నాడు. ఒక టైంలో మోకాలి నొప్పితో రిటైర్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడు అశ్విన్. నొప్పిని అదుపులో ఉంచుకునేందుకు ఇంజెక్షన్స్ కూడా తీసుకునేవాడట. తర్వాత బెంగళూరుకు వెళ్లి పాత బౌలింగ్ యాక్షన్ ను కంటిన్యూ చేయగా మోకాలి నొప్పలు పోయాయట. తర్వాత నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యాడు. అశ్విన్ కు ఇప్పుడు 36 ఏళ్లు. ఈ వయసులో కూడా ఈ ఫిట్ నెస్ ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.