Home > క్రీడలు > IND vs ENG : అశ్విన్ అరుదైన ఫీట్.. 45 ఏళ్ల రికార్డు బద్దలు

IND vs ENG : అశ్విన్ అరుదైన ఫీట్.. 45 ఏళ్ల రికార్డు బద్దలు

IND vs ENG : అశ్విన్ అరుదైన ఫీట్.. 45 ఏళ్ల రికార్డు బద్దలు
X

టీమ్ ఇండియా(team india) వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(aswin) చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్నటెస్టులో భారత్ స్టార్ బౌలర్ ఈ అరుదైన ఘనత సాధించాడు.

నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌ను ఔట్‌ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట రాసుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 96 వికెట్లు అశ్విన్ పడగొట్టాడు. కాగా అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉండేది. 1964-79 కాలంలో అతడు ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. అయితే తాజా మ్యాచ్‌తో 45 ఏళ్ల చంద్రశేఖర్ ఆల్‌టైమ్‌ రికార్డును రవిచంద్రన్ బ్రేక్‌ చేశాడు.

ఈ జాబితాలో అశ్విన్‌ తర్వాతి స్ధానాల్లో చంద్రశేఖర్ (95), అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ (85), కపిల్ దేవ్ (85), ఇషాంత్ శర్మ (67) ఉన్నారు. అంతేగాక ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మరో వికెట్‌ పడగొడితే టెస్టుక్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన క్లబ్‌లో చేరుతాడు.

Updated : 5 Feb 2024 8:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top