Home > క్రీడలు > Ashwin : టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డు...ఇంగ్లాండ్ పై వికెట్ల శతకం

Ashwin : టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డు...ఇంగ్లాండ్ పై వికెట్ల శతకం

Ashwin : టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డు...ఇంగ్లాండ్ పై వికెట్ల శతకం
X

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ లో వికెట్ల శతకంతో దుమ్ములేపాడు. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డులెకెక్కాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో స్పిన్‌ దిగ్గజం అశ్విన్‌ ఈ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. ఆ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర లిఖించాడు. ఇంగ్లాండ్ పై నాలుగవ టెస్ట్

తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో.. అశ్విన్‌ వేసిన రెండో బంతికి బెయిర్‌ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల తీసిన మార్క్‌ ను అందుకున్నాడు. అంతేకాదు.. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ నిలిచాడు. జేమ్స్‌ అండర్సన్‌ భారత్ పై టెస్టుల్లో 35 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు తీసి ముందంజలో ఉన్నాడు.

అంతేగాక అశ్విన్ డబుల్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు,100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్‌ మరో రికార్డ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతని కంటే ముందు జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించారు.

ఇప్పటికే 500 వికెట్ల మైలురాయిని దాటిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు అశ్విన్. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో ముందున్నాడు. కాగా ప్రస్తుతం 349 వికెట్లతో వద్ద ఉన్న అశ్విన్‌.. మరో రెండు వికెట్లు తీసుకుంటే కుంబ్లేను అధిగమిస్తాడు. ఇక మరో రికార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. టెస్టుల్లో కుంబ్లే 35 సార్లు ‘ఐదు వికెట్ల’ ఘనత అందుకోగా..అశ్విన్‌ ఇప్పటి వరకు 34 సార్లు ఆ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లో చెలరేగితే.. ఈ రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు అనడంతో ఎలాంటి సందేహం లేదు.

Updated : 23 Feb 2024 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top