IND vs NEP: నేడే నేపాల్‌తో టీమిండియా ఢీ.. ఓడితే ఇంటికే..
X
2023 ఆసియా కప్‌లో భాగంగా భారత్ రెండో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. పల్లెకెలె వేదికగా సోమవారం భారత్.. నేపాల్‌తో తలపడనుంది. అయితే తొలి మ్యాచ్ వర్షార్పణం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకొని మినీటోర్నీలో ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టి, సూపర్ 4 కు అర్హత సాధించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ పేసర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక.. వికెట్లు పారెసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో నేపాల్ జట్టుపై కచ్చితంగా టీమిండియా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-నేపాల్ మ్యాచు సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. క్యాండీలోని వాతావరణ నివేదిక ప్రకారం.. సోమవారం పల్లెకెల్లెలో 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. మ్యాచు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది . ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే భారత్-నేపాల్ జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉ్ననాయి. ఇప్పటికే తొలి మ్యాచులో పాకిస్థాన్ గెలిచి రెండు పాయింట్లు సాధించింది. రెండో మ్యాచు రద్దు కావడంతో మరో పాయింట్ లభించింది. మొత్తంగా మూడు పాయింట్లతో పాకిస్థాన్ గ్రూప్-4 దశకు అర్హత సాధించింది. ఇక టీమిండియా విషయానికొస్తే.. ఈరోజు మ్యాచ్ వర్షం కారణంగా సజావుగా జరగపోతే భారత్ కు మరో పాయింట్ వస్తుంది. దీంతో మొత్తంగా రెండు పాయింట్లతో భారత్ కూడా గ్రూప్-4 దశకు గ్రూప్-Aలో రెండో స్థానంతో వెళ్లనుంది. లీగ్ దశలో ఒక్క మ్యాచు కూడా పూర్తిగా ఆడకుండా, గెలవకుండానే టీమిండియా గ్రూప్-4కు చేరుతుంది. నేపాల్ ఇంటి బాట పడుతుంది.