Home > క్రీడలు > హమయ్య.. చివరికి ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయింది

హమయ్య.. చివరికి ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయింది

హమయ్య.. చివరికి ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయింది
X

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయింది. ఎన్నో చర్చల అనంతరం ఆసియా కప్ షెడ్యూల్ ను ఆమోదించారు. ఆసియా కప్​ నిర్వహణ విషయంలో పాకిస్థాన్​ ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​కే ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) మొగ్గుచూపడంతో టోర్నీ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆసియా కప్‌-2023 షెడ్యూల్‌ ఖరార్ చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనుండగా.. మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహిస్తారు.

మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పాల్గొంటాయి. టోర్నీలో ఈ ఏడాది మూడు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూప్ లో.. ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఒక గ్రూప్ లో ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 17న ఫైనల్‌లో తలపడతారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన న ACC పురుషుల ప్రీమియర్ కప్ ఫైనల్‌లో UAEని ఓడించి ఆసియాకప్‌‌కు నేపాల్ అర్హత సాధించింది.

Asia Cup 2023 schedule has been officially released





Updated : 19 July 2023 6:50 PM IST
Tags:    
Next Story
Share it
Top