Home > క్రీడలు > India vs Sri Lanka: నేడే ఫైనల్ పోరు

India vs Sri Lanka: నేడే ఫైనల్ పోరు

India vs Sri Lanka: నేడే ఫైనల్ పోరు
X

క్రికెట్ ఫ్యాన్స్‌కు టీమిండియా.. తమ మ్యాచ్‌లతో అదిరిపోయే ఫన్‌ను ఇస్తోంది. గత వారం ఆసియా కప్‌ గెలిచి అభిమానుల దిల్ ఖుష్ చేసిన భారత్‌.. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో జయకేతనం ఎగురవేసి మరోసారి వారి మనసులను గెలుచుకుంది. ఆదివారం కంగారులతో ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ 99 పరుగుల తేడాతో గెలిచి.. మరో మ్యాచ్​ మిగిలుండగానే వన్డే సిరీస్​ను 2-0 తో కైవసం చేసుకుంది. అయితే భారత జట్టు జోరు నిన్నటితో ఆగిపోలేదు. ఈ రోజు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. సోమవారం ఫైనల్ పోరులో భారత్.. శ్రీలంకను ఢీకొట్టనుంది.

అయితే ఇది పురుషుల జట్లు మధ్య కాదండోయ్.. ఈ మ్యాచ్ ఇరుదేశాల మహిళల క్రికెట్ జట్ల మధ్య ఉండనుంది. ఇప్పటికే (పురుషుల విభాగం)ఆసియా కప్‌ ఫైనల్‌ (Asia Cup Final)లో టీమ్‌ఇండియా.. శ్రీలంక జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 50 పరుగులకే ఆలౌటైంది. ఈ టార్గెట్ ను భారత్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇక ఈ రోజు మహిళల వంతు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు చైనాలోని హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

చైనా వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్​ను ఈ గేమ్స్​లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లీగ్​, సెమీఫైనల్​ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత మహిళల జట్టు.. ఫైనల్​కు చేరింది. తద్వారా ఫైనల్స్​కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక మరో సెమీస్​లో శ్రీలంక- పాకిస్థాన్​తో తలపడ్డాయి. ఇందులోలో శ్రీలంక 6 వికెట్లతో నెగ్గి.. ఫైనల్​ పోరుకు అర్హత సాధించింది. దీంతో తుది పోరులో భారత్​-శ్రీలంక మహిళల జట్లు తలపడనున్నాయి. శ్రీలంకతో పోలిస్తే అని విభాగాల్లో భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో విజయంపై భారత్ ధీమాగా ఉంది. ఫైనల్ పోరులో గెలిస్తే.. టీమ్‌ఇండియా స్వర్ణ పతకాన్ని ముద్దాడనుంది.

Updated : 25 Sept 2023 8:03 AM IST
Tags:    
Next Story
Share it
Top