Asian Games :అదరగొడుతున్న అమ్మాయిలు.. భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
X
"చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది". ఇప్పటికే మూడు గోల్స్ సాధించిన భారత్.. (Indian shooting trio) తాజాగా మరోటి తన ఖాతాలో వేసుకుంది. 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. భారతదేశ షూటింగ్ బృందంలో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ త్రయం ఉన్నారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 16వ పతకం. అంతకుముందు నాలుగో రోజు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల మహిళల జట్టు రజతంతో పతకాల్లో భారత్ ఖాతా తెరిచింది.
బుధవారం, సెప్టెంబర్ 27న జరిగిన ఈ కాంపిటీషన్ లో మను బాకర్, ఇషా సింగ్, రిత్మ్ సాంగ్వాన్ 1759 పాయింట్లతో భారత్ కు గోల్డ్ సాధించారు.ఈ రోజు భారత్‌కు ఇది రెండో పతకం. ఆతిథ్య చైనా జట్టు 1756 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి.. రజతం సాధించింది. ఆసియా క్రీడలు ప్రారంభమైన మూడోరోజున భారత గుర్రపు స్వారీ చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత బంగారు పతకం దక్కించుకోవడం విశేషం.
అంతకుముందు, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ జట్టులో మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే సత్తా చాటారు. మొత్తం 1764 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఈ ఈవెంట్‌లో ఆతిథ్య దేశం చైనా 1773 స్కోరుతో స్వర్ణం గెలుచుకోగా.. సౌత్‌కొరియా 1756 పాయింట్లతో కాంస్య పతకం అందుకుంది. వ్యక్తిగత ఈవెంట్‌లో కౌశిక్ 18వ స్థానంలో నిలవగా, సమ్రా స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇక చౌక్సే కాంస్య పతకాన్ని అందుకుంది. ఈ ఏషియన్ గేమ్స్ లో భారత్ 16 పతకాలు గెలుచుకోగా అందులో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. నాలుగో రోజు భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు పతకాలు చేరాయి. దేశ ఖాతాలో తొలి పతకం రజతం రూపంలో చేరింది. ఇప్పటి వరకు రెండు పతకాలు భారత మహిళల జట్లే గెలుచుకున్నాయి.