Home > క్రీడలు > World cup 2023: ఆసీస్ ఓటమికి కారణం.. బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. మరి?

World cup 2023: ఆసీస్ ఓటమికి కారణం.. బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. మరి?

World cup 2023: ఆసీస్ ఓటమికి కారణం.. బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. మరి?
X

ఐదు సార్లు ప్రపంచ చాంపియన్స్. వరల్డ్ లో టాప్ జట్టు. టోర్నీలో హాట్ ఫేవరెట్. ఎటువంటి పరిస్థితులనుంచైనా బయటికొచ్చి విజయాన్ని చేరుకునే టాప్ ఆటగాళ్లు. అంతకు మించి మెగా టోర్నీల్లో.. ఎవరికీ అంతుపట్టని వారి వ్యూహాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రేలియా జట్టు గురించి బోలెడు విషయాలున్నాయి. అయితే (World cup 2023) ఈ వరల్డ్ కప్ మాత్రం ఆస్ట్రేలియాకు అస్సలు కలిసి రావడం లేదు. జట్టు నిండా స్టార్ ప్లేయర్లున్నా.. ఆడిన రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో మొదట ఆదిపత్యాన్ని ప్రదర్శించినా.. కోహ్లీ క్యాచ్ మిస్ చేసి మ్యాచ్ చేజార్చుకుంది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఫీల్డింగ్ వైఫల్యాలను కొనసాగిస్తూ వచ్చిన అవకాశాలను చేజార్చుకుంది.





ఇక బ్యాటింగ్ లో అదరగొడతారనుకున్న కంగారు జట్టుకు అంపైర్లు విలన్ గా మారారు. ఇద్దరు స్టార్ బ్యాటర్ల విషయంలో అంపైర్ల తప్పుడు నిర్ణయం.. ఆసీస్ కు తీరని అన్యాయం జరిగింది. దీంతో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలి మ్యాచ్ ఓడిపోయింది. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, మార్కస్ స్టయినీస్ నాటౌట్ అయినా అంపైర్లు అవుట్ గా ఇచ్చారనే ఆరోపణ వస్తుంది. 10వ ఓవర్ లో రబాడా బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. తర్వాత స్టోయినిస్ విషయంలో కూడా అదే జరిగింది. రబాడా వేసిన వైడ్ బంతి.. స్టోయినిస్ థై పాడ్స్ కు తగులుతూ వెళ్తుంది. దాన్ని కూడా థర్డ్ అంపైర్ ఔట్ ఇస్తాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ చేయి జారిపోతుంది. కాగా ఆసీస్ ప్లేయర్లు, అభిమానులు అంపైర్ల తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయంలో ఐసీసీ స్పష్ట ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి మెగా టోర్నీల్లో టెక్నాలజీని సరిగా ఉపయోగించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











Updated : 13 Oct 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top