IND vs AUS : ఐదు వికెట్లు తీసిన షమీ.. భారత్ టార్గెట్ 277 రన్స్
X
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌కు 277 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్ 276 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్ మార్ష్ (4), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) స్కోర్ చేశారు. మ్యాచ్ ఆఖరిలో కమిన్స్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి.
ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. షమీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. షమీ వేసిన 48.2వ ఓవర్ బంతిని భారీ షాట్ కొట్టే యత్నంలో షార్ట్ (2) సూర్య చేతికి చిక్కాడు. అదే ఓవర్ నాలుగో బాల్‌కు సీన్ అబాట్ (0)ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. షమీ 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా, బుమ్రా (1/43), అశ్విన్ (1/47), జడేజా (1/51) కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. శార్దూల్ ఠాకూర్ 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 78 పరుగులు సమర్పించాడు.