Home > క్రీడలు > David Warner : నా ఆశయం అదే.. డేవిడ్ వార్నర్ ఏం చెప్పాడంటే..?

David Warner : నా ఆశయం అదే.. డేవిడ్ వార్నర్ ఏం చెప్పాడంటే..?

David Warner : నా ఆశయం అదే..  డేవిడ్ వార్నర్ ఏం చెప్పాడంటే..?
X

డేవిడ్ వార్నర్.. ఇప్పటికే తన వన్డే కెరీర్కు గుడ్ బై చెప్పగా.. ఇటీవలే తన టెస్టు కెరీర్కూ వీడ్కోలు పలికాడు. అయితే టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన వార్నర్.. గెలుపుతో సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ క్రమంలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కోచ్గా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ముందుగా తన వైఫ్తో మాట్లాడాలని చెప్పారు. ఇంటికి మరికొంత కాలం దూరంగా ఉండేందుకు ఆమె పర్మిషన్ ఇస్తుందో లేదా అని కామెంట్ చేశాడు.

అదేవిధంగా స్లెడ్జింగ్ అంశంపై కూడా వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో క్రికెట్లో స్లెడ్జింగ్ దూరమవుతుందని చెప్పాడు. ‘‘టీంలోకి వచ్చిన కొత్తలో గ్రౌండ్లో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి చూసేవాడిని. వారు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వారి ఫోకస్ను దెబ్బతీసేవాడిని. అయితే ఐపీఎల్‌ లాంటి ఫార్మాట్ల వల్ల ప్రత్యర్థులు ఒకే డ్రెస్సింగ్ రూంను పంచుకుంటున్నారు. ఇకపై స్లెడ్జింగ్‌ ఉంటుందని అనుకోవడం లేదు. వచ్చే 5, 10 ఏళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్‌ కంటే గెలవడంపైనే ఆటగాళ్లు ఎక్కువ దృష్టిసారిస్తారు’’ అని వార్నర్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 8 Jan 2024 8:42 AM IST
Tags:    
Next Story
Share it
Top