IND vs AUS W: భారత్ చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
X
సొంత గడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. చివరి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 190 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 3-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 7 వికెట్లు కోల్పోయి 338 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. చివర్లో ఆష్లే గార్డ్ నర్ (30), అన్నాబెల్ సదర్ ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. అమన్ జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో భారత్ 32.4 ఓవర్లలో కేవలం 148 రన్స్ మాత్రమే చేసి కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (29), రిచా ఘోష్ (19), జెమీమా రోడ్రిగెజ్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జార్జియా వేర్హమ్ 3, మెగాన్ షట్ 2, అలానా కింగ్ 2, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 2 వికెట్లతో సత్తాచాటారు. కాగా తదుపరి జనవరి 5,7,9 తేదీల్లో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులన్నీ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతాయి.