Home > క్రీడలు > Aus vs SA: వరల్డ్కప్లో.. మరో మెగా సమరం. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

Aus vs SA: వరల్డ్కప్లో.. మరో మెగా సమరం. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

Aus vs SA: వరల్డ్కప్లో.. మరో మెగా సమరం. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
X

వరల్డ్ కప్ లో మరో మెగా సమరానికి టైం అయింది. లక్నో వేదికపై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిన ఆసీస్.. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తుంది. శ్రీలంకపై భారీ విక్టరీతో వరల్డ్ కప్ ను మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. అదే జోరును కొనసాగించాలని చూస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో ఆసీస్ రెండు మార్పులు చేసింది. గ్రీన్ స్థానంలో స్టోయినిస్ బరిలోకి దిగగా.. అలెక్స్ క్యారీ ప్లేస్ లో జోష్ ఇల్లింగ్స్ ఎంట్రీ ఇచ్చారు. సౌతాఫ్రికా స్పిన్నర్ షమ్సీని జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), టెంబా బవుమా(సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబాడ, తబ్రైజ్ షమ్సీ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్


Updated : 12 Oct 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top