Home > క్రీడలు > IND vs AUS: ఆస్ట్రేలియా జైత్రయాత్రకు భారత్ కళ్లెం వేస్తుందా? 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?

IND vs AUS: ఆస్ట్రేలియా జైత్రయాత్రకు భారత్ కళ్లెం వేస్తుందా? 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?

IND vs AUS: ఆస్ట్రేలియా జైత్రయాత్రకు భారత్ కళ్లెం వేస్తుందా? 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా?
X

చెన్నై వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ మొదలయింది. ఈ టోర్నీలో ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. పటిష్టంగా ఉన్న రెండు జట్లు టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగాయి. అయితే ఏ వరల్డ్ కప్ లోనూ ఆసీస్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే.. మెగా టోర్నీల్లో ఆ జట్టును ఓడించడం, వాళ్ల వ్యూహాలు తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఇప్పటివరకు ఐదు వరల్డ్ కప్ లను (1987, 1999, 2003, 2007,2015) సొంతం చేసుకుంది. అయితే వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ జైత్ర యాత్ర మామూలిది కాదు. టోర్నీ ముందు ఆడిన వార్మప్ మ్యాచుల్లో ఓడిపోయినా.. అసలు మ్యాచ్ లకు వచ్చేసరికి సత్తా చాటుతారు.

అయితే 1999 నుంచి ఆస్ట్రేలియా ఆడిన తొలి వరల్డ్ కప్ మ్యాచ్ లో ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ 24 ఏళ్లుగా ఆసీస్ ఏ టోర్నీలో మొదటి మ్యాచ్ ఓడిపోలేదు. ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో కూడా గెలిచి ఆ రికార్డ్ ను కొనసాగించాలని ఆసీస్ చూస్తోంది. కాగా భారత అభిమానులు మాత్రం భారత్ గెలిచి టోర్నీని గొప్పగా ఆరంభించాలని చూస్తున్నారు. ఇవాళ్టి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తడబడుతుంది. 30 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. జడేజా 3 వికెట్లు తీసుకోగా.. బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆసీస్ బ్యాటర్లు వార్నర్ 41, స్మిత్ 46, లబుషేన్ 27 పరుగులు చేశారు. మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ డకౌట్ గా వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్ వెల్ 4, కమెరున్ గ్రీన్ ఉన్నారు.




Updated : 8 Oct 2023 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top