Home > క్రీడలు > IND vs AUS: వీరులారా.. విజయీభవ.. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

IND vs AUS: వీరులారా.. విజయీభవ.. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

IND vs AUS: వీరులారా.. విజయీభవ.. బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
X

మహాసంగ్రామం మొదలైంది. అహ్మదాబాద్ వేదికపై టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. లక్షా 30 వేల మధ్య జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు విన్నింగ్ టీమ్స్ తోనే బరిలోకి దిగుతున్నాయి. 20 ఏళ్ల ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వాతావరణం అంతా మామూలుగానే ఉందని, వర్షం పడే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలపడంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెండింతలైంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(w), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Updated : 19 Nov 2023 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top