ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..?
X
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న కీలక పోరులో ఆస్ట్రేలియా 286 రన్స్ చేసింది. 49.3 ఓవర్లలో 286 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. మార్నస్ లాబుషాగ్నే 71, కామెరాన్ గ్రీన్ 47, స్టీవెన్ స్మిత్ 44, స్టోయినిస్ 35 రన్స్తో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వుడ్ 2, ఆదిల్ రషీద్ 2, లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ తలో వికెట్ చేశారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆసీస్ మూడో ప్లేస్ లో ఉంది. ఇప్పటివరకు 6మ్యాచులు ఆడిన ఆసీస్ 4మ్యాచుల్లో విజయం సాధించింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం పరిస్థితి పూర్తి రివర్స్గా ఉంది. వరల్డ్ కప్లో ప్రస్తుతం అన్ని జట్లు సెమీస్ బెర్త్ కోసం పోరాడుతుంటే.. ఇంగ్లాండ్ మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించేందుకు ఆడుతుంది. పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్లో ఉన్న ఇంగ్లాండ్.. ఆడిన 6 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచింది. కాగా చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే.. పాయింట్స్ టేబుల్లో టాప్ 7లో ఉండాలి. దీంతో ఇంగ్లాండ్ మిగిలిన 3 మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే డిఫెండింగ్ చాంపియన్ చాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా ఉండిపోతుంది.