Home > క్రీడలు > AUS vs PAK: విధ్వంసం అందించినా.. వెనకడుగేశారు

AUS vs PAK: విధ్వంసం అందించినా.. వెనకడుగేశారు

AUS vs PAK: విధ్వంసం అందించినా.. వెనకడుగేశారు
X

బెంగళూరులో పాకిస్తాన్ కు విశ్వరూపం చూపించింది ఆస్ట్రేలియా. ఒక్కో పాక్ బౌలర్ ను ఊచకోత కోస్తూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. మొదటి ఓవర్ నుంచి పాక్ బౌలర్లపై ఆదిపత్యం ప్రదర్శిచింది. బౌడరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్లే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. డేవిడ్ వార్నర్ విధ్వంసానికి, మిచెల్ మార్ష్ తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్.. 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. అదే జోరును మార్ష్ కూడా కొనసాగిస్తూ.. 108 బంతుల్లో 9 సిక్సర్లు, 10 ఫోర్లతో 121 పరుగులు చేసి సెంచరీలు సాధించారు. దీంతో ఈ జోడీ ఈ టోర్నీలో మొదటి వికెట్ కు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.

తర్వాత వచ్చిన ఏ ఆసీస్ బ్యాటర్ కూడా వార్నర్, మార్ష్ అందించిన జోరును కొనసాగించలేకపోయారు. ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత వచ్చిన వాళ్లంతా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మ్యాక్స్ వెట్ డకౌట్ కాగా.. స్మిత్ (7), స్టోయినిస్ (21), ఇంగ్లిస్ (13), లబుషేన్ (8) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆసీస్ ఓపెనర్ల ముందు తేలిపోయిన పాక్ బౌలర్లు తర్వాత పుంజుకుని రన్ రేట్ ను తగ్గించారు. బాల్స్ డాట్ చేస్తూ.. వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ కు 400 స్కోర్ మార్క్ ను దాటడం అసాధ్యం అయింది. ఈ ఇన్నింగ్స్ లో మొదటి 4 ఓవర్లు తేలిపోయిన హారిస్ రౌఫ్ తర్వాత రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. హారిస్ రౌఫ్ 3, ఉసామా మిర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజం నిర్ణయాన్ని అంతా తప్పుబడుతున్నారు. బ్యాటింగ్ పిచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే బాబర్ చేసిన అతిపెద్ద తప్పని అంటున్నారు.




Updated : 20 Oct 2023 6:08 PM IST
Tags:    
Next Story
Share it
Top