Home > క్రీడలు > Maxwell: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. ఆసీస్దే విజయం

Maxwell: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. ఆసీస్దే విజయం

Maxwell: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. ఆసీస్దే విజయం
X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీ చేసినా.. బౌలింగ్ దళం దాన్ని కాపాడుకోలేకపోయారు. సీనియర్లు లేని లోటును వేలెత్తిచూపుతూ.. మ్యాక్స్ వెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. మెరుపు సెంచరీ చేసి ఆసీస్ ను గెలిపించాడు. ఈ విజయంతో ఆసీస్ సిరీస్ రేసులో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ మెరుపు సెంచరీ (123, 57 బంతుల్లో, 13 ఫోర్లు, 7 సిక్సర్లు), సూర్య కుమార్ (39), తిలక్ వర్మ (31 రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకిదిగిన ఆసీస్.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. ఓడిపోతున్న మ్యాచ్ ను మ్యాక్స్ వెల్ ఒంటరి పోరాటంతో గెలిపించాడు. 48 బంతుల్లో 104 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్ (35) రాణించాడు. తాజా విజయంతో 2-1తో సిరీస్ పై ఆశలను ఆసీస్ పదిలం చేసుకుంది. సెంచరీతో అదరగొట్టిన మ్యాక్స్ వెల్.. రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు రోహిత్ (4) పేరిట ఉండగా, నిన్నటి మ్యాచ్ తో మ్యాక్స్ వెల్ హిట్ మ్యాన్ సరసన నిలిచాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్ ల్లో నాలుగు సెంచరీలు చేయగా.. మ్యాక్స్ వెల్ 92 ఇన్నింగ్స్ ల్లోనే ఆ ఘనత సాధించారు. బాబర్ ఆజం, సూర్య కుమార్ యాదవ్ చెరో మూడు సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Updated : 29 Nov 2023 10:24 AM IST
Tags:    
Next Story
Share it
Top