IND vs AUS: నేడే మూడో టీ20.. ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు
X
వరుస విజయాలు సాధించి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. టీమిండియాను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. కానీ తర్వాత భారత్ తో మొదలైన టీ20 ద్వైపాక్షిక దారుణంగా ఫెయిల్ అవుతుంది. 5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా.. ఆసీస్ ను చిత్తు చేసింది. పూర్తి కుర్రాళ్లతో కూడిన ఈ జట్టు.. సీనియర్లతో నిండిన ఆసీన్ ను చిత్తు చేస్తుంది. దాంతో ఇవాళ జరిగే ప్రెస్టేజ్ మ్యాచ్ గా తీసుకున్న ఆసీస్.. వరల్డ్ కప్ విన్నింగ్ టీంను బరిలోకి దింపుతుంది. ఇప్పటికే స్మిత్, జంపా ఆడుతుండగా.. ఇవాళ జరిగే మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, స్టోయినిస్, ఇంగ్లిస్, అబాటులను తీసుకొస్తుంది. వీరితో కలిపి తాజాగా 13 మందితో కూడిన రివైజ్డ్ జట్టును ఆసీస్ ప్రకటించింది.
ఆస్ట్రేలియా రివైస్డ్ జట్టు: మాథ్యూ వేడ్ (సి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్