AUS vs WI : ఆస్ట్రేలియా సంచలనం.. వన్డే మ్యాచ్ను 6 ఒవర్లలో ముగించారు
X
కొత్త తరం క్రికెట్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. టీ20 పవర్ ప్లేలో (ఆరు ఓవర్లు) 100 పరుగులు కొట్టిన జట్లే.. వన్డే, టెస్ట్ మ్యాచులకు వచ్చేసరకి అదే ఆరు ఓవర్లలో మ్యాచ్ లు ముగిసిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో అదే జరిగింది. గబ్బాలో ఆసీస్ ను చిత్తు చేసి.. టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకున్న విండీస్.. వన్డే మ్యాచ్ లో తేలిపోయింది. దీంతో ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రికార్డును నమోదుచేసింది. కాగా ఈ మ్యాచ్ ఆసీస్ జట్టుకు 1000వ మ్యాచ్ కావడం, ఆ మ్యాచ్ లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. కాన్ బెర్రాలో జరిగిన చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ విండీస్ ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసి... 259 బంతులు మిగిలుండగానే అంటే 6.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసింది. అంతకుముందు 2004లో యూఎస్ఏ జట్టుపై 253 బంతులు మిగిలుండగానే.. ఆసీస్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ తర్వాత వన్డేల్లో ఎక్కువ మ్యాచులు ఆడిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులు చేసింది. ఓపెనర్ అలిక్ అథనాజ్ (32) టాప్ స్కోరర్. విండీస్ బ్యాటర్లలో టెడ్డీ బిషప్, మాథ్యూ ఫోర్డే, మోటీ, ఓషేన్ థామస్ డకౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లు లాన్స్ మోరీస్, జాంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జేవియర్ బార్ట్‌లెట్ 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్..6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు జోస్ ఇంగ్లిస్ (35, 16 బంతుల్లో), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (41, 18 బంతుల్లో) ఆసీస్ ను గెలిపించారు.
#AUSvWI #CricketNews
— Crickskills (@priyansh1604) February 6, 2024
Australia vs West Indies, 3rd ODI
🚨INNINGS BREAK🚨
WestIndies:-8️⃣6️⃣ Allout(24.1 overs)
Xavier Barlett - 4/21 Wickets
Australia Need 8️⃣7️⃣ Runs In 5️⃣0️⃣ Overs pic.twitter.com/sxcQqiHJtY