Home > క్రీడలు > సెమీస్ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. ఆస్ట్రేలియా గెలుపు

సెమీస్ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. ఆస్ట్రేలియా గెలుపు

సెమీస్ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. ఆస్ట్రేలియా గెలుపు
X

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన కీలక పోరులో ఆస్ట్రేలియా 33 రన్స్ తో విజయం సాధించింది. 287 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 48.1 ఓవర్లలో 253 రన్స్కే ఆలౌట్ అయ్యింది. డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. మలన్ 50, బెన్ స్టోక్స్ 64, మొయిన్ అలీ 42, క్రిస్ వోక్స్ 32 చేయగా.. మిగితా బ్యాట్స్మెన్స్ 20లోపే ఔట్ అయ్యారు.

ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జాంపా 3 వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్ 2, హాజిల్‌వుడ్ 2, మిచెల్ స్టార్క్ 2, స్టోయినిస్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. మార్నస్ లాబుషాగ్నే 71, కామెరాన్ గ్రీన్ 47, స్టీవెన్ స్మిత్ 44, స్టోయినిస్ 35 రన్స్తో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వుడ్ 2, ఆదిల్ రషీద్ 2, లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ తలో వికెట్ చేశారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆసీస్ మూడో ప్లేస్లో ఉంది. ఇప్పటివరకు 7మ్యాచులు ఆడిన ఆసీస్ 5మ్యాచుల్లో విజయం సాధించింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం పరిస్థితి పూర్తి రివర్స్గా ఉంది. వరల్డ్ కప్లో ప్రస్తుతం అన్ని జట్లు సెమీస్ బెర్త్ కోసం పోరాడుతుంటే.. ఇంగ్లాండ్ మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించేందుకు ఆడుతుంది. పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్లో ఉన్న ఇంగ్లాండ్.. ఆడిన 7 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచింది. కాగా చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే.. పాయింట్స్ టేబుల్లో టాప్ 7లో ఉండాలి. దీంతో ఇంగ్లాండ్ మిగిలిన 3 మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే డిఫెండింగ్ చాంపియన్ చాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా ఉండిపోతుంది.


Updated : 4 Nov 2023 5:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top