AUS vs PAK : ఓపెనర్ల విధ్వంసం.. పాకిస్తాన్పై ఆసీస్ ఘనవిజయం
X
వరల్డ్ కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 రన్స్ తేడాతో పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. 367 రన్స్ చేసింది. ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచి పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. వార్నర్ విధ్వంసానికి, మిచెల్ మార్ష్ తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. సెంచరీలతో వార్నర్, మార్ష్ స్టేడియాన్ని హోరెత్తించారు. వార్నర్ 163, మార్ష్ 121 రన్స్తో జట్టు భారీ స్కోర్ చేయడంలో మెయిన్ రోల్ పోషించారు. దీంతో ఈ జోడీ ఈ టోర్నీలో మొదటి వికెట్కు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తక్కువ స్కోర్కే ఔట్ అయ్యారు. పాక్ బౌలర్లలో షాహిన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. హారిస్ రౌఫ్ 3, ఉసామా మిర్ ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక 368 రన్స్తో బరిలోకి దిగిన పాక్ 305 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చిన ఆ తర్వాత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో రిజ్వాన్ మాత్రమే 46 రన్స్ చేయగా.. మిగితా బ్యాట్స్ మెన్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆడమ్ జాంపా 4 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, పాట్ కమిన్స్ తలో 2 వికెట్లు, హాజిల్‌వుడ్, స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు.