AUS vs SL: బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘన విజయం
X
వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకొని 35.2 ఓవర్లలోనే 210 పరుగుల టార్గెట్ పూర్తి చేసింది. మిచెల్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 (51 బంతుల్లో 9 ఫోర్స్), జోష్ ఇంగ్లిష్ 58 (59 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్స్) రన్స్ చేసి హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మార్నస్ లబుషేన్ (40), మాక్స్‌వెల్ (31*) పరుగులు చేశారు. స్టాయినిస్ 20* (10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ ) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో మధుశనక 3 వికెట్లు పడగొట్టగా, దునిత్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచిబ్యాటింగ్ చేసిన లంక జట్టు 209 రన్స్కు ఆలౌటైంది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మినహా ఇంకెవరూ రాణించలేదు. చరిత్ అసలంక (25) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్(9), సదీర సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వా (7), దునిత్ వెల్లలాగే (2), చమిక కరుణరత్నే (2), మహీశ్ తీక్షణ (0), లాహిరు కుమార (4) ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో సాధించగా.. పాట్ కమిన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశాడు.