Ind vs Aus : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
X
సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ వేటకు టీమిండియా సిద్ధమైంది. వరల్డ్ టోర్నీ గెలువడమే లక్ష్యంగా కదనరంగంలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా భారత్ తొలిపోరులో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. చెన్నై వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రాండ్ విక్టరీతో టోర్నీని ప్రారంభించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉండగా.. భారత్కు షాకివ్వాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
వరల్డ్ కప్కు ముందు రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఈ మ్యాచులో భారత్ ను ఓడించి కసి తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. అయితే ఆసీస్ను మట్టికరిపించి మెగా టోర్నిని గ్రాండ్ గా స్టార్ట్ చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ కీలక మ్యాచుకు శుభ్ మన్ గిల్ దూరమయ్యాడు. ఫీవర్తో బాధపడుతున్న అతడు కోలుకోకపోవడంతో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు.
టీమిండియా : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆసీస్ జట్టు : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా