బాబర్ అజామ్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై
X
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్‌లో తమ జట్టు దారుణమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ‘‘మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ డెసిషన్ తీసుకున్నందుకు బాధగా ఉంది. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పటికీ.. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ఆటగాడిగా కొనసాగుతాను. నాకు ఈ అవకాశమిచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’’ ’’ అని బాబర్ ట్వీట్ చేశాడు.
ఈ వరల్డ్ కప్లో పాక్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. 9 మ్యాచ్లలో నాలుగింట మాత్రమే గెలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిన్న జట్టైన ఆఫ్గాన్ చేతిలోనూ ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంది. కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. అతడు 9మ్యాచులలో 320 రన్స్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 స్థానానికి కూడా చేజార్చుకున్నాడు. 2020లో అతడు పాక్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు.