IND vs PAK: టీమిండియాపై గెలిచే అవకాశాలు మాకే ఎక్కువున్నై
X
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొదటి రైవలరీ మ్యాచ్ ను వర్షం కారణంగా మిస్ అయిన అభిమానులకు ఇది మరో అవకాశం. ఇవాళ (సెప్టెంబర్ 10) కొలంబో వేదికగా సూపర్ 4లో మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని, మళ్లీ వర్షం వల్ల మ్యాచ్ రద్దవుతుందని ఆందోళన చెందిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కొలంబోలో వర్షం ఆగిపోయి ఎండ కొడుతుందని తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ కు ముందు తమ జట్టు శ్రీలంకతో సిరీస్ ఆడటం తమకు కలిసొస్తుందని చెప్పాడు. కాగా ఇవాళ జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ తప్పక గెలుస్తుందని, భారత్ పై ఒత్తిడి పెట్టేందుకు తమ ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నాడు. అయితే భారత్ ను కూడా తక్కువ అంచనాలు వేయలేమని, లంకలో ఎక్కువ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్నవాళ్లు టీమిండియాలో ఉన్నారని అన్నాడు. తమ జట్టుకు మిడిల్ ఆర్డర్ వికెట్లు తీయడం సమస్యగా ఉందని, ప్రాక్టీస్ లో దానిపై శ్రద్ధ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. కాగా కొలంబో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. దుర్భేద్యమైన పేస్ బౌలింగ్ కలిగిన పాక్ బౌలర్లను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.