PAK vs BAN: పాకిస్తాన్తో కీలక పోరులో టీం మార్చిన బంగ్లాదేశ్.. గెలిస్తే సెమీస్కు!
X
ఈడెన్ గార్డెన్స్ వేదికపై మరో కీలక పోరుకు జరుగనుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాగా.. ఇందులో గెలిచిన జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. పెద్ద జట్టుగా బరిలోకి దిగిన పాక్.. టోర్నీలో ఫెయిల్ అయి.. విమర్శలు ఎదుర్కొంటుంది. ఆడిన 6 మ్యాచుల్లో నాలుగిట్లో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ పాక్ కు అగ్ని పరీక్ష కానుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మెహదీ హసన్ ను పక్కనబెట్టి హ్రిదయ్ కు చాన్స్ ఇచ్చింది.
తుది జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (c), ముష్ఫికర్ రహీమ్ (w), మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్