Pakistan vs Bangladesh : తక్కువ స్కోర్కే బంగ్లాదేశ్ ఆలౌట్.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?
Krishna | 31 Oct 2023 6:37 PM IST
X
X
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు సత్తా చాటారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో బంగ్లా 44.1 ఓవర్లలో 204 రన్స్కే ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా 56 రన్స్ చేయగా.. లిట్టర్ దాస్ 45, షకీబ్ అల్ హసన్ 43 రన్స్తో రాణించారు. మిగితా బ్యాట్స్ మెన్స్ 30 పరుగులకు మించి చేయకపోవడంతో తక్కువ స్కోర్కే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం తలో 3 వికెట్ల పడగొట్టగా.. హరీస్ రవూఫ్ 2, ఉసామా మీర్ 1 వికెట్ తీశారు. పాయింట్స్ టేబుల్ లో పాక్ ఏడో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉంది.
Updated : 31 Oct 2023 6:37 PM IST
Tags: Pakistan vs Bangladesh pak vs ban babar azam Shaheen Afridi Mohammad Wasim Mahmudullah Shakib al hasan Litton Das ICC Cricket World Cup 2023 world cup 2023 odi world cup cwc 2023 cricket world cup sports news cricket news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire