Home > క్రీడలు > Asia Cup 2023,BAN vs SL: ఆసియాకప్‌లో మరో కీలక పోరు.. శ్రీలంకతో బంగ్లాదేశ్‌ ఢీ

Asia Cup 2023,BAN vs SL: ఆసియాకప్‌లో మరో కీలక పోరు.. శ్రీలంకతో బంగ్లాదేశ్‌ ఢీ

Asia Cup 2023,BAN vs SL: ఆసియాకప్‌లో మరో కీలక పోరు.. శ్రీలంకతో బంగ్లాదేశ్‌ ఢీ
X

ఆసియాకప్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సూపర్‌-4 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంకతో బంగ్లాదేశ్‌ పోటీపడనుంది. సూపర్‌-4 లో పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిది. శ్రీలంకపై ఓడిపోతే.. నిష్క్రమించడం దాదాపు ఖాయం. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చెందింది. ఇప్పుడు బంగ్లా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్ గెలిచి క్వాలిఫై అవ్వాలని చూస్తుంది.

ఇక గ్రూప్ స్టేజ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న శ్రీలంక ఇప్పుడు మరోసారి బంగ్లాతో జరగబోయే మ్యాచ్ గెలవాలన్న కసితో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాను 164 పరుగులకే కూల్చి అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధిస్తే ఆస్ట్రేలియా తర్వాత వన్డేలలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలుస్తుంది. ఇటీవలే అఫ్గాన్‌తో మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో వరుసగా 12వ విజయం. నేటి మ్యాచ్‌లో బంగ్లాను ఓడిస్తే ఆ జట్టు ఖాతాలో 13వ విజయం వచ్చి చేరుతుంది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా (21) పేరిట ఉంది. బంగ్లాను ఓడిస్తే లంక రెండో స్థానానికి చేరుతుంది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం నేటి మ్యాచ్‌కు వేదిక కానుంది. పల్లెకెలెతో పోల్చితే కొలంబోలో పిచ్ మరింత స్లోగా ఉంటుంది. గడిచిన ఐదేండ్లలో ఇక్కడ హయ్యస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు సగటు 267 గా ఉంది. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై ఇరుజట్లూ ఎలా ఆడతాయో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. నేడు కొలంబోలో వర్షం పడే అవకాశాలు 68శాతం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుది జట్లు (అంచనా) :

శ్రీలంక : పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరాన

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, లిటన్ దాస్, అఫిఫ్ హోసెన్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫీకర్ రహీమ్, షమీమ్ హోసెన్, మెహిది హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్

Updated : 9 Sept 2023 11:47 AM IST
Tags:    
Next Story
Share it
Top