IND vs BAN: నీచానికి దిగజారిన బంగ్లా.. అయినా రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ
X
రికార్డుల రారాజు, రన్ మెషిన్, కింగ్ కోహ్లీ.. తన అద్భుత ఆటతీరుతో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. వన్డేల్లో 48వ సెంచరీని నమోదుచేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ చివరి క్షణంలో ఉత్కంఠ నెలకొంది. టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ సెంచరీకి 3 పరుగులు అవసరం అయ్యాయి. ఈ టైంలో కోహ్లీ సెంచరీకి బంగ్లాదేశ్ అడ్డుపడింది. 42వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన నజుమ్ అహ్మద్.. తొలి బంతిని వైడ్ వేశాడు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి నజుమ్ వైపు చూశాడు.
అయితే ఆ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వలేదు. బంగ్లా బౌలర్ తప్పును వేలెత్తి చూపించాడు. ఆ తర్వతా బంతి డాట్ కాగా.. మూడో బంతికి కోహ్లీ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. నజుమ్ చర్యకు అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఫెయిర్ ప్లే కాదని, ఓ ప్లేయర్ రికార్డ్ కు అడ్డపడటం తప్పని ఫైర్ అవుతున్నారు. కాగా ఇలా చేయడం బంగ్లాకు కొత్తేంకాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి తప్పులు చేసి, చివాట్లు తిన్నది.
ఈ మ్యాచ్ తో కోహ్లీ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 35 రన్స్ వద్ద కోహ్లి.. శ్రీలంక బ్యాటర్ జయవర్దనే రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25,957 పరుగులు (725 ఇన్నింగ్స్ లు) సాధించాడు. ఆ రికార్డ్ ను కోహ్లీ తిరగరాశాడు. కాగా కోహ్లీ 567 ఇన్నింగ్స్ ల్లోనే 25,960 రన్స్ సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్ 3లో సచిన్ 34,357(782 ఇన్నింగ్స్ లో), కుమార సంగక్కర 28,016 (666 ఇన్నింగ్స్ లో), రికీ పాంటింగ్ 27,483 (668 ఇన్నింగ్స్ లో) ఉన్నారు.
Umpire doesn't give wide to virat
— Nischay Singh Goyal (@NischaySinghGo1) October 19, 2023
Best moment of match. 🤣🤣🤣🤣#indiavsbangladesh #INDvBAN #ViratKohli #ICCCricketWorldCup #INDvBAN #ViratKohli pic.twitter.com/c2pQ6L8rwi