Home > క్రీడలు > ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో సూపర్ పర్ఫార్మెర్స్.. విండీస్ టూర్లో ఏమైంది..?

ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో సూపర్ పర్ఫార్మెర్స్.. విండీస్ టూర్లో ఏమైంది..?

ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో సూపర్ పర్ఫార్మెర్స్.. విండీస్ టూర్లో ఏమైంది..?
X

విండీస్తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లో టీమిండియా సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ లో వర్షం పడకపోతే.. దాదాపు గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపించాయి. అరంగేట్రం చేసిన ఆటగాళ్లు జైశ్వాల్, ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా క్లిక్ అయ్యారు. అయితే, బెంగంతా రాహానే, శుభ్ మన్ గిల్ పైనే ఉంది. జట్టుకు పూర్తిగా దూరం అయిన రహానే.. దేశవాళి, ఐపీఎల్ లో రాణించి జట్టులో తిరిగి చోటు సంపాదించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో అదరగొట్టి.. విండీస్ సిరీస్ కు వైస్ కెప్టెన్ అయ్యాడు. ఈ దశలో టీమిండియాకు తిరుగులేదు అని ఆనుకునే క్రమంలో.. రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలం అయి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

సింగిల్ డిజిట్ స్కోరుకే (3, 8) పరిమితమై మళ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వచ్చే మ్యాచ్ లో రహానేను తప్పించి వేరే ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్న మాట. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మళ్లీ డిసెంబర్ వరకు టీమిండియాకు టెస్ట్ మ్యాచ్ లు లేవు. దాంతో ఈ గ్యాప్ లో రహానే దేశవాళిలో రాణిస్తేనే జట్టులో చోటు ఉంటుంది. లేదంటే మరో ప్లేయర్ కు ఆ స్లాట్ బుక్ అవుతుంది. గిల్ కూడా ఈ సిరీస్ లో నిరాశ పరిచాడు. జైశ్వాల్ ఓపెనర్ గా వచ్చిన క్రమంలో గిల్ ను మూడో వికెట్ లో పంపించింది మేనేజ్మెంట్. తానే మూడో వికెట్ లో వస్తాడని మేనేజ్మెంట్ తో చర్చించాడట. ఆ స్థానంలో వచ్చే బ్యాట్స్ మెన్ క్రీజులో పాతుకుపోవాల్సి ఉంటుంది. అయితే, గిల్ మాత్రం నిరాశ పరిచాడు. దాంతో వచ్చే మ్యాచ్ లో ఆ స్థానంలో బరిలోకి దిగుతాడా లేదా చూడాలి.

Updated : 25 July 2023 2:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top