టీమిండియా ఫ్యాన్స్కు టీ20ల విందు.. మెగా టోర్నీ ముగిసిన వెంటనే మరో సిరీస్
X
టీమిండియా అభిమానులకు రాబోయే రోజుల్లో టీ20 మ్యాచ్ ల విందు అందనుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగిశాక.. తర్వాత ఆడబోయే ద్వైపాక్షిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ముగిశాక.. ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్.. అది ముగిసిన వెంటనే జింబాబ్వే గడ్డపై మరో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికలపై జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ, జింబాబ్వే క్రికెట్ బోర్డులు ఈ విషయాన్ని ప్రకటించాయి.
జులై 6న ప్రారంభమయ్యే ఈ సిరీస్.. జులై 14తో ముగుస్తుంది. ఈ మ్యాచులన్నీ హరారే వేదికగా జరగనున్నాయి. కాగా భారత జట్టు జింబాబ్వేతో చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ ఆడింది. 2016లో చివరి ద్వైపాక్షిక సిరీస్ కు జింబాబ్వే వెళ్లింది. ఈ సిరీస్ లో టీమిండియా 2-1తో గెలిచింది.
భారత్ - జింబాబ్వే షెడ్యూల్:
– 1st టీ20 : జులై 6
– 2nd టీ20 : జులై 7
– 3rd టీ20 : జులై 10
– 4th టీ20 : జులై 13
– 5th టీ20 : జులై 14