Home > క్రీడలు > BCCI : క్రికెటర్ల రిటైనర్షిప్ను ప్రకటించిన బీసీసీఐ.. ఇషాన్, అయ్యర్లకు అనుకున్నదే అయింది

BCCI : క్రికెటర్ల రిటైనర్షిప్ను ప్రకటించిన బీసీసీఐ.. ఇషాన్, అయ్యర్లకు అనుకున్నదే అయింది

BCCI : క్రికెటర్ల రిటైనర్షిప్ను ప్రకటించిన బీసీసీఐ.. ఇషాన్, అయ్యర్లకు అనుకున్నదే అయింది
X

క్రికెటర్ల రిటైనర్షిప్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఊహించిందే జరిగింది. రంజీల్లో ఆడమని హెచ్చరించినా వినని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బీసీసీఐ. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో వీళ్లిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. గతేడాది కాంట్రాక్ట్ లో లేని జైస్వాల్ ఈసారి జాక్ పాట్ కొట్టాడు. కాగా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనంగా ఏటా రూ. 7 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్న వారికి రూ.5 కోట్లు, బీ కేటగిరీలో ఉన్నవారికి రూ.3 కోట్లు, సీ కేటగిరిలో ఉన్నవారికి రూ.కోటి అందిస్తారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్:

గ్రేడ్ A+లో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవింద్ర జడేజా ఉన్నారు.

గ్రేడ్ Aలో.. రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కేఎప్ రాహుల్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

గ్రేడ్ Bలో.. సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్ ఉన్నారు.

గ్రేడ్ Cలో.. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్ టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్ దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటీదార్ ఉన్నారు.

Updated : 28 Feb 2024 2:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top