Home > క్రీడలు > వెస్టిండీస్ టూర్‌కు భారత్ టీ20 జట్టు ఎంపిక..ఐపీఎల్ హీరోలకు ఛాన్స్

వెస్టిండీస్ టూర్‌కు భారత్ టీ20 జట్టు ఎంపిక..ఐపీఎల్ హీరోలకు ఛాన్స్

వెస్టిండీస్ టూర్‌కు భారత్ టీ20 జట్టు ఎంపిక..ఐపీఎల్ హీరోలకు ఛాన్స్
X

వెస్టిండీస్ పర్యటన కోసం భారత్ జట్టు టీ20 జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 15 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేసింది. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టులో యువకులకు పెద్దపీట వేశారు. ఐపీఎల్‎లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకట్టుకున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు స్థానం దక్కింది. మరో ఐపీఎల్ హీరో యశస్వి జైస్వాల్ కూడా చోటు కల్పించారు. సంజూ శాంసన్‌, రవి బిష్ణోయి, ముఖేశ్‌ కుమార్‌లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్ టూర్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలతో ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఐదు టీ20 మ్యాచ్‌లతో ముగుస్తుంది. ఆగస్టు 3 నుంచి టీ20లు ప్రారంభ కానున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కు సంబంధించిన జట్లను ప్రకటించారు. రోహిత్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌కు వెళ్లిన టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు.
వెస్టిండీస్ టూర్‌కు భారత్ టీ20 జట్టు : ఇషాన్ కిషన్ (wk), గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (C), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

Updated : 5 July 2023 10:13 PM IST
Tags:    
Next Story
Share it
Top