IND vs ENG : ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్.. కీలక ఆటగాళ్లకు దక్కని చోటు..
X
ఈ నెల 25 నుంచి ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్లోని మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ టీంను ప్రకటించింది. ఇందులో కీలక ఆటగాళ్లను పక్కనబెట్టింది. గాయంతో కోలుకుంటున్న షమీని ఎంపిక చేయలేదు. తర్వాతి టెస్టులకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పుజారా రహానే, ఇషాన్ కిషాన్లకు జట్టులో స్థానం దక్కలేదు. ఇక యూపీకి చెందిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు తొలిసారి టీంలో స్థానం దక్కింది. శార్దుల్ ఠాకూర్ ను కూడా పక్కనబెట్టిన సెలక్టర్లు.. గాయంతో చికిత్స తీసుకుంటున్న ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేశ్ ఖాన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టీంకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా ఎంపిక అయ్యాడు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరగనుంది. ఫ్రిబవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు జరగనుండగా.. మిగితా మూడు టెస్టులు రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరుగుతాయి. భారత జట్టు : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.