Home > క్రీడలు > ఆసియాకప్‎కు భారత్ జట్టు ఎంపిక..వారిద్దరు వచ్చేశారు..

ఆసియాకప్‎కు భారత్ జట్టు ఎంపిక..వారిద్దరు వచ్చేశారు..

ఆసియాకప్‎కు భారత్ జట్టు ఎంపిక..వారిద్దరు వచ్చేశారు..
X

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2023 కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును సెలక్టర్ అజిత్ అగార్కర్ సోమవారం వెల్లడించారు. సంజూశాంసన్‎ను రిజర్వ్ ప్లేయర్‎గా ఎంపిక చేశారు. గాయం కారణంగా ఇన్ని రోజులు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు.

అరంగ్రేటంలో అదరగొడుతున్న తెలుగుతేజం తిలక్ వర్మ ఆసియాకప్‌కు అవకాశం దక్కింది. ఐర్లాండ్ పర్యటన ద్వారా పునరాగమనం చేసి బుమ్రాతో పాటు మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా జట్టులోకి వచ్చారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైఎస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నారు.

ఆసియా కప్ యొక్క 16వ ఎడిషన్ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. మొత్తం ఆరుజట్లు పాల్గొంటున్నాయి.పాకిస్థాన్ లో టీమిండియా ఆడేందుకు నిరాకరించడంతో.. ఈ టోర్నీని పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‎తో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. మరో రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 4న భారత్-నేపాల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ్ కప్‎కు ముందు ఆడే ఆసియాకప్ భారత్‎కు కీలకం కానుంది. ఆసియాకప్‎లో రాణిస్తే వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

భారత్ జట్టు..

రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ , మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్)






Updated : 21 Aug 2023 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top