Home > క్రీడలు > డిసెంబర్ 10న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్

డిసెంబర్ 10న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్

డిసెంబర్ 10న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్
X

మరోసారి దయాదుల పోరు చూసే అవకాశం వచ్చింది. ఏషియన్ దేశాల మధ్య జరిగే అండర్ 19 ఆసియా కప్ సమరానికి రంగం సిద్ధం అయింది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన యువ జట్టును ప్రకటించింది. ఉద‌య్ స‌హ‌ర‌న్‌ కెప్టెన్‌గా వ్యహరించనుండగా, సౌమీ కూమార్ పాండే వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యారు. టీమిండియా ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుండగా.. డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఢీకొననుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు.. భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, జపాన్ పాల్గొంటున్నాయి.

భారత అండర్-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా , ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆరధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.

స్టాండ్‌బై ప్లేయర్స్: ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గోసాయి, మహమ్మద్ అమన్.

రిజర్వ్ ప్లేయర్స్: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.

Updated : 26 Nov 2023 3:51 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top