Home > క్రీడలు > BCCI Invites Applications : అతన్ని తప్పించిన బీసీసీఐ.. సెలక్టర్ కావాలని ప్రకటన

BCCI Invites Applications : అతన్ని తప్పించిన బీసీసీఐ.. సెలక్టర్ కావాలని ప్రకటన

BCCI Invites Applications : అతన్ని తప్పించిన బీసీసీఐ.. సెలక్టర్ కావాలని ప్రకటన
X

సెలక్టర్ కావాలని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పురుషుల సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో ఒక పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్ ను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. పోయిన ఏడాది చేతన్ శర్మ స్థానంలో అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ప్యానెల్ లో సలీల్ అంకోలా (వెస్ట్), శివ సుందర్‌ దాస్‌ (ఈస్ట్), శ్రీధరన్‌ శరత్ (సౌత్‌), సుబ్రతో బెనర్జీ (సెంట్రల్‌) జోన్ల నుంచి ఉన్నారు. అజిత్ అగార్కర్ కూడా వెస్ట్ జోన్ నుంచే ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్నారు. అయితే బీసీసీఐ రాజ్యాంగంలో.. ఒక జోన్ నుంచి ఒక సెలక్టర్ మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. దీంతో సలీల్ అంకోలాను ప్యానెల్ నుంచి తప్పించారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని నార్త్ జోన్ నుంచి ఒకరిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. జనవరి 26వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

అంతేకాకుండా.. దరఖాస్తు చేసుకునేవారికి ఉండాల్సిన అర్హతలను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేవారికి కనీసం 7 టెస్ట్ మ్యాచులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అనుభం ఉండాలి. లేదంటే.. 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిఉండాలి. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తై ఉండాలి. మొత్తం 5 ఏళ్లపాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నవాళ్లు అర్హులు.





Updated : 16 Jan 2024 12:47 PM IST
Tags:    
Next Story
Share it
Top