Home > క్రీడలు > ఏషియన్ గేమ్స్లో టీమిండియా.. కోహ్లీ, రోహిత్ లేకుండా బరిలోకి..!

ఏషియన్ గేమ్స్లో టీమిండియా.. కోహ్లీ, రోహిత్ లేకుండా బరిలోకి..!

ఏషియన్ గేమ్స్లో టీమిండియా.. కోహ్లీ, రోహిత్ లేకుండా బరిలోకి..!
X

ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. గతంలో వీటిపై అంతగా ఆసక్తి చూపిని బీసీసీఐ.. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి చైనాలో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పురుషుల జట్టును కూడా బరిలోకి దింపాలని చూస్తోంది. దానికోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. చివరిసారి ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న మహిళల జట్టు.. ఫైనల్ కు చేరి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈసారి మహిళా జట్టుతో పాటు.. పురుషుల టీం కూడా పాల్గొంటుందని సమాచారం. అయితే, ఈసారి పాల్గొనే పురుషుల జట్టులో మెయిన్ టీంకి బదులుగా.. భారత్ బీ టీంను బరిలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి కారణం.. అదే టైంలో భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ క్రమంలో ఒకే జట్టును రెండు టోర్నీలు ఆడించడం అసాధ్యం. కావున.. భారత్ బీ టీంను బరిలోకి దించే పనిలో బీసీసీఐ ఉంది. ఈ జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధవన్ ని నియమిస్తారట. టీమిండియా వరల్డ్ కప్ కు ధవన్ ను జట్టులోకి తీసుకోరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధవన్ కు గౌరవంగా ఏషియన్ గేమ్స్ లో టీమిండియా కెప్టెన్ గా ధవన్ ను నియమిస్తున్నారు. అయితే, అదే జరిగితే.. తిలక్ వర్మ, రింకూ సింగ్ లాంటి యంగ్ స్టర్స్ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం కానుంది. ఈ వార్త నిజం అయితే, భారత అభిమానులకు ఒకే టైంలో వరల్డ్ కప్, ఏషియన్ గేమ్స్ తో మంచి కిక్ దొరుకుతుంది.

Updated : 27 Jun 2023 8:35 PM IST
Tags:    
Next Story
Share it
Top