ఖజానా నింపుకోవడానికి పెద్ద ప్లాన్.. ఆ టెండర్లకు పిలుపు
X
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచ క్రికెట్ శాసిస్తున్న బోర్డ్ మరో ప్లాన్ మొదలు పెట్టింది. భరీ మొత్తంతో ఖజానాను నింపుకునేందుకు సిద్ధమయింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్ కు టెండర్లు ఆహ్వానిస్తూ మంగళవారం (ఆగస్ట్ 1) ట్వీట్ చేసింది. ప్రముఖ కంపెనీల నుంచి అప్లికేషన్ కోరుతూ ప్రకటన విడుదల చేసింది. టెండర్ కు అప్లై చేసుకునేవాళ్లు జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించాలి. అలా చెళ్లించిన వాళ్లకు ఇన్విటేషన్ టు టెండర్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా.. ఇలా అప్లికేషన్ కు చెల్లించిన డబ్బు నాన్ రిఫండబుల్ అని బీసీసీఐ తెలిపింది.
నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం టెండర్ దరఖాస్తుకు చివరి తేది ఆగస్టు 21. ఆసక్తి గల కంపెనీలు తమ పేమెంట్ వివరాలు titlesponsor.itt@bcci.tv కు మెయిల్ చేయాలని బీసీసీఐ స్పష్టం చేసింది. టెండర్ లో స్పాన్సర్షిప్ దక్కించుకున్న కంపెనీలు.. బీసీసీఐ అన్ని కార్యక్రమాల్లో టైటిల్ స్పాన్సర్స్ గా వ్యవహిస్తాయి.
bcci Invitation to Tender for title sponsor