Hardik Pandya Injury: తీవ్రమైన గాయం.. జట్టుకు పాండ్యా దూరం
X
న్యూజిలాండ్ తో జరిగే కీలక పోరు ముంగిట టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం అయ్యాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులుచెప్పుకొచ్చారు. గాయం తీవ్రం కావడంతో పాండ్యాను.. బెంగళూరులోని ఎన్సీఏకి తీసుకెళ్లారు. నిన్న గ్రౌండ్ నుంచి నేరుగా హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్ తీపించారు.
ఈ రిపోర్ట్ ను వైద్య బృందం అంచనా వేస్తుంది. ఇంజెక్షన్ల తోనే పాండ్యా కోలుకుంటాడా లేదా అనే పరీక్షిస్తుంది. దీనికోసం బీసీసీఐ ఇంగ్లాండ్ స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించింది. కాగా నిన్నటి మ్యాచ్ లో బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. దాన్ని హార్దిక్ కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. దాంతో బాల్ హార్దిక్ కాలి మడమకు బలంగా తాకింది. దీంతో హార్దిక్ నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి హార్దిక్ ను పరీక్షించి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.
మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘విజయం సాధించాం. అప్పుడే అయిపోలేదు. గతం కంటే బలంగా తిరిగొస్తా’ అని ట్వీట్ చేశాడు. అతి చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అయి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తర్వాత మ్యాచ్ కు తప్పక తిరిగొస్తాడని ఆశిస్తున్నారు. పాండ్యాకు గాయాలవడం కొత్తేం కాదని, అతని కమ్ బ్యాక్ గట్టిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Got the win ✅ Will be back stronger than ever ✌️ #CWC23 pic.twitter.com/eqZGCodFfT
— hardik pandya (@hardikpandya7) October 19, 2023