Home > క్రీడలు > BCCI : మూడు ఫార్మట్లు, ముగ్గురు కెప్టెన్లు.. ముగిసిన పుజారా, రహానే కెరీర్

BCCI : మూడు ఫార్మట్లు, ముగ్గురు కెప్టెన్లు.. ముగిసిన పుజారా, రహానే కెరీర్

BCCI : మూడు ఫార్మట్లు, ముగ్గురు కెప్టెన్లు.. ముగిసిన పుజారా, రహానే కెరీర్
X

వరుస సిరీస్ లతో టీమిండియా బిజీ అయిపోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా సౌతాఫ్రికా సిరీస్ కు బయలుదేరుతుంది. 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. దీనికోసం బీసీసీఐ జట్లను కూడా ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఈ సిరీస్ లో.. మూడు ఫార్మట్లలో ముగ్గురు కెప్టెన్లతో ఆడనుంది. టీ20 పగ్గాలు సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించగా.. వన్డే జట్టును కేఎల్ రాహుల్ నడిపిస్తున్నాడు. ఇక వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్, షమీలు.. తిరిగి టెస్ట్ సిరీస్ లో ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ టెస్ట్ జట్టులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూనియర్ వాల్ గా పేరు పొందిన చటేశ్వర పుజారా, అజింక్య రహానేలకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

దీంతో వీరి కెరీస్ కు ఫుల్ స్టాప్ పడిందా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతుంది. గత కొంత కాలంగా వీరిద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడమే దీనికి కారణం అని క్రికెట్ వర్గాలు చెప్తున్న మాట. అంతేకాకుండా వీరి వయసు (35) కూడా సమస్యగా మారింది. క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న వీరు.. రాణించకపోవడం, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడం జట్టుకు భారంగా మారారు. దాంతో వీరిని సెలక్టర్లు పక్కనబెట్టినట్లు తెలుస్తుంది. వీరి స్థానంలో జూనియర్లకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లను వీరికి ప్రత్యామ్నాయాలుగా భావిస్తున్నారు. టీమిండియా టెస్ట్ క్రికెట్ వీరేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రహానే, పుజారాల కెరీస్ ఖతమైందని చెప్తున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ




Updated : 1 Dec 2023 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top