Home > క్రీడలు > టీమిండియా బిజీ షెడ్యూల్.. ఐర్లాండ్ టీ20 సిరీస్ ఎప్పుడంటే..?

టీమిండియా బిజీ షెడ్యూల్.. ఐర్లాండ్ టీ20 సిరీస్ ఎప్పుడంటే..?

టీమిండియా బిజీ షెడ్యూల్.. ఐర్లాండ్ టీ20 సిరీస్ ఎప్పుడంటే..?
X

వరల్డ్ కప్ కోసం ఫ్రెష్ గా ప్రణాళికలు రూపొందించుకునేందుకు జట్టును సిద్ధం చేసుకునేందుకు బీసీసీఐకి మంచి టైం దొరికింది. ఆటగాళ్లు కూడా నెల రోజుల విరామం తర్వాత తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నారు. జులై నెలలో వెస్టిండీస్ సిరీస్ తో మొదలుకుని.. వరల్డ్ కప్ వరకు మొత్తం బిజీ షెడ్యుల్ గడపనున్నారు. వెస్టిండీస్ పర్యటన అనంతరం.. వెంటనే అక్కడి నుంచి నేరుగా ఐర్లాండ్ వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సిరీస్ లో భారత్ మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లు రాత్రి 7:30కు మొదలవుతాయి. అయితే ఈ సిరీస్ కోసం భారత్ ఇంకా టీంను ప్రకటించలేదు. ఈ సిరీస్ ముగిసిన వారం రోజులకు ఆసియా కప్ ప్రారంభం అవుతుంది.

ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్:


ఆగస్ట్ 18 - తొలి టీ20 (మలాహిడే)

ఆగస్ట్ 20 - రెండో టీ20 (మలాహిడే)

ఆగస్ట్ 23 - మూడో టీ20 (మలాహిడే)

Updated : 28 Jun 2023 7:49 PM IST
Tags:    
Next Story
Share it
Top