Home > క్రీడలు > ఏసీసీ చీఫ్‌గా మరోసారి బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపిక

ఏసీసీ చీఫ్‌గా మరోసారి బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపిక

ఏసీసీ చీఫ్‌గా మరోసారి బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపిక
X

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యారు. బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో షా పేరును శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వ ప్రతిపాదించగా సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. తనపై ఉంచిన నమ్మకానికి షా కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలో క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇక 2019లో బీసీసీఐ సెక్రటరీగా ఎన్నికైన జై షా.. భారత క్రికెట్‌ బోర్డుకు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. ప్రెసిడెంట్‌గా రోజర్‌ బిన్నీ ఉన్నా అధికారాలన్నీ జై షా వద్దే ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.

అయితే ఐసీసీ చైర్మన్‌గిరి కోసం జై షా బీసీసీఐ సెక్రటరీతో పాటు ఏసీసీ చీఫ్‌గా వైదొలగనున్నట్టు తెలుస్తున్నది. ఏసీసీ అధ్యక్షుడి పదవీ కాలం రెండేండ్లు కాగా ప్రస్తుతం జై షా రెండో ఏడాదిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నాళ్లు భారత క్రికెట్‌తో పాటు ఆసియా క్రికెట్‌లో చక్రం తిప్పిన జై షా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే జై షా ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జై షా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఐసీసీ అధ్యక్షుడైతే భారత క్రికెట్ అభిమానులకు అది గొప్ప వార్తే అవుతుంది.

Updated : 31 Jan 2024 4:02 PM IST
Tags:    
Next Story
Share it
Top