Home > క్రీడలు > ఐర్లాండ్ సిరీస్ జట్టు ఎంపిక.. అతను రావడంతోనే ప్రమోషన్

ఐర్లాండ్ సిరీస్ జట్టు ఎంపిక.. అతను రావడంతోనే ప్రమోషన్

ఐర్లాండ్ సిరీస్ జట్టు ఎంపిక.. అతను రావడంతోనే ప్రమోషన్
X

గాయం నుంచి కోలుకున్న జస్ప్రిత్ బుమ్రా.. జట్టులోకి ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐర్లాండ్ తో జరుగనున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అందులో బుమ్రాను కెప్టెన్ గా ప్రకటిస్తూ.. 15 మందితో కూడిన టీంను ప్రకటించింది. పోయిన ఏడాది నుంచి వెన్ను నొప్పితో బాధ పడుతున్న బుమ్రా.. జట్టుకు పూర్తి దూరంగా ఉన్నాడు.

బెంగళూరులోని ఎన్సీఏలో ఇంతకాలం చికిత్స పొందిన బుమ్రా.. ఫిట్ నెస్ కోసం శ్రమించాడు. కొంతకాలంగా నెట్స్ లో కష్టపడుతూ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం అతని ఫిట్ నెస్ ను టెస్ట్ చేసిన ఎన్సీఏ.. పునరాగమానికి అనుమతినిచ్చింది. దీంతో ఆసియా కప్, వన్డ్ వరల్డ్ కప్ కు భారత్ కు శుభవార్త అనే చెప్పాలి. పోయిన టోర్నీల్లో బుమ్రా లేక జట్టు ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఐర్లాండ్ టీ20 సిరీస్ లో బుమ్రా ఎంట్రీ ఖాయం అయింది.

భార‌త జ‌ట్టు:

జ‌స్‌ప్రీత్ బుమ్రా (C), రుతురాజ్ గైక్వాడ్ (W/K), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), జితేష్ శర్మ (W/K), శివమ్ దూబే, వాషింగ్ట‌న్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

టీ20 సిరీస్ షెడ్యూల్:

మొదటి టీ20: ఆగస్ట్ 18 (డబ్లిన్)

రెండో టీ20: ఆగస్ట్ 20 (డబ్లిన్)

మూడో టీ20: ఆగస్ట్ 23 (డబ్లిన్)




Updated : 31 July 2023 10:54 PM IST
Tags:    
Next Story
Share it
Top