IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్కు భారత జట్టు.. విరాట్, రోహిత్లకు రెస్ట్
X
వరల్డ్ కప్ కు ముందు టీమిండియా గట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే మేటి ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యే ఈ మూడు వన్డేల సిరీస్ కు బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ జట్టు ప్రకటన ఎవ్వరూ ఊహించని విధంగా ఉండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దికా పాండ్యాలకు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 18 రోజుల్లో వరల్డ్ కప్ పెట్టుకుని పెద్ద ప్లేయర్లకు విశ్రాంతినివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ టైంలో ప్రయోగం అవసరమా అంటూ బీసీసీఐని ఎద్దేవా చేస్తున్నారు. బీసీసీఐ మాత్ర ప్లేయర్ల ఆటతీరును పరిశీలించడానికి, కీ ప్లేయర్లకు ప్రశాంతతను ఇచ్చి టోర్నీని ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మొదటి రెండు వన్డేలకు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (C), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, తిలక్ వర్మ, ప్రసిద్ధ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
3వ వన్డేకు భారత జట్టు:
రోహిత్ శర్మ (C), హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.