Home > క్రీడలు > IND vs ENG: కోహ్లీ స్థానంలో ఆడేదెవరో తేలిపోయింది.. ఆర్సీబీ ప్లేయర్ను సెలక్ట్ చేసిన బీసీసీఐ

IND vs ENG: కోహ్లీ స్థానంలో ఆడేదెవరో తేలిపోయింది.. ఆర్సీబీ ప్లేయర్ను సెలక్ట్ చేసిన బీసీసీఐ

IND vs ENG: కోహ్లీ స్థానంలో ఆడేదెవరో తేలిపోయింది.. ఆర్సీబీ ప్లేయర్ను సెలక్ట్ చేసిన బీసీసీఐ
X

టెస్ట్ క్రికెట్ లో మరో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. రేపటి నుంచి (జనవరి 25) ఉప్పల్ వేదికగా ప్రారంభం కాబోయే ఈ టెస్ట్ సిరీస్ మొదటి రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే మరో ప్లేయర్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ రేసులో నలుగురు ప్లేయర్లు ఉండగా.. సెలక్టర్లు రజత్ పటిదార్ ను ఎంపిక చేశారు. మంగళవారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంతో కమిటీ పటిదార్ పేరును ఖరారు చేసింది.

పటిదార్ ఇప్పటికే వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చి.. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. తాజాగా ఇండియా-ఏ జట్టులో కూడా స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌ తో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఏ తరపున 151 పరుగులు చేశాడు. వార్మప్ మ్యాచ్ లో కూడా 111 పరుగులు చేశాడు. అటు రంజీట్రీఫీలోనూ పటిదారు అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకు 2021లో ప్రాతినిథ్యం వహించిన పటిదార్.. తర్వాత వెన్నెముక సర్జరీ తర్వాత జట్టుకు దూరం అయ్యాడు. ఇటీవల కోలుకుని జట్టులో ఎంట్రీ ఇచ్చి అధరగొడుతున్నాడు. 30 ఏళ్ల పటిదార్ ఇప్పటివరకు 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడగా.. 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి.

Updated : 24 Jan 2024 3:02 PM IST
Tags:    
Next Story
Share it
Top