Home > క్రీడలు > నేడు రెండో వన్డే.. కోహ్లీని పక్కనబెట్టిన బీసీసీఐ..!

నేడు రెండో వన్డే.. కోహ్లీని పక్కనబెట్టిన బీసీసీఐ..!

నేడు రెండో వన్డే.. కోహ్లీని పక్కనబెట్టిన బీసీసీఐ..!
X

బార్బడోస్ వేదికగా ఇవాళ (జులై 29) విండీస్ తో రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. 3 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు తొలి మ్యాచ్ లో గట్టి పోటీ ఇచ్చిన విండీస్.. అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని పక్కనబెట్టేందుకు బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి టెస్ట్ మ్యాచ్, మొదటి వన్డేలో విరాట్ స్థానంలో జూనియర్లను పంసిన పంపిన విషయం తెలిసిందే. చివరి టెస్ట్ లో తన నాలుగో స్థానం బ్యాటింగ్ ను ఇషాన్ కిషన్ కు అప్పగించి బెంచ్ పై కూర్చున్నాడు. మొదటి వన్డేలో రోహిత్, విరాట్ పక్కన కూర్చొని కుర్రాళ్లను ఆడించారు. రానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ కోసం ప్లేయర్లను వెతికే పనిలో బీసీసీఐ పడ్డట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జూనియర్స్ లో ఆత్మవిశ్వాసం పెంచడానికి బ్యాటింగ్ ఆర్డర్ లో వాళ్లను ముందుకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో రెండో వన్డేలో విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి సంజూ శాంసన్ ను ఆడించాలని నిర్ణయించుకున్నారు.

Updated : 29 July 2023 7:54 AM IST
Tags:    
Next Story
Share it
Top