Home > క్రీడలు > BCCI Warns Kohli : విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

BCCI Warns Kohli : విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

BCCI Warns Kohli : విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
X

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ కోసం సిద్ధం అవుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్ నుంచి పూర్తి రెస్ట్లో ఉన్న విరాట్.. పెద్ద టోర్నీలకోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇకపోతే ఆసియాకప్, వరల్డ్ కప్ల్లో అందరి కళ్లు విరాట్ కోహ్లీ పైనే ఉంటాయి. జట్టును ముందుండి నడిపించాలని అందరు కోరుకుంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి బీసీసీఐని ఆగ్రహానికి గురిచేసింది. అంతేకాదు బీసీసీఐ పెద్దలు కోహ్లీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త చర్చల్లో నిలిచింది.

ఆటగాళ్ల ఫిట్నెస్ కనుక్కునేందుకు ప్రతీ ఏటా బీసీసీఐ యోయో టెస్ట్ నిర్వహిస్తుంది. ఆసియా కప్, వరల్డ్ కప్ను బేస్ చేసుకుని జట్టులో ఉన్న ప్రతీ ఆటగాళ్లకు బీసీసీఐ యోయో టెస్ట్ నిర్వహించింది. యోయో టెస్ట్లో బీసీసీఐ నిర్దేశించిన స్కోరు 16.5. ఈ స్కోర్ను కోహ్లీ దాటాడు. 17.2 సాధించి.. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘యోయో టెస్ట్ పూర్తయింది. 17.2 సాధించినందుకు ఆనందంగా ఉంది’అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై బీసీసీఐ ఫైర్ అయింది. వ్యక్తిగత గోప్యత విషయాలను పబ్లిక్గా పోస్ట్ చేయడంపై మండిపడింది. ‘ఆటగాళ్లు ట్రైనింగ్ ఫొటోలు షేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫిట్నెస్ స్కోర్, అంతర్గత విషయాలు బహిర్గతం చేయడం సరికాదు. అది బీసీసీఐ కాంట్రాక్ట్కు విరుద్ధం’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా బీసీసీఐ రూల్స్ తెలిసినా వాటిని ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి వార్నింగ్ కూడా ఇచ్చింది. మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దంటూ చెప్పుకొచ్చింది.

Updated : 27 Aug 2023 11:02 AM IST
Tags:    
Next Story
Share it
Top