Home > క్రీడలు > IND vs ENG: స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్.. బెన్ స్టోక్స్ నిలబడ్డా తప్పలేదు

IND vs ENG: స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్.. బెన్ స్టోక్స్ నిలబడ్డా తప్పలేదు

IND vs ENG: స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్.. బెన్ స్టోక్స్ నిలబడ్డా తప్పలేదు
X

ఉప్పల్ లో అదే సీన్ రిపీట్ అయింది. పిచ్ స్పిన్నర్లకే సపోర్ట్ చేసింది. భారీ స్కోర్ చేస్తుందనుకున్న ఇంగ్లాండ్ జట్టు.. టీ బ్రేక్ లోపే చాప చుట్టేసింది. భారత స్పిన్నర్లదాటికి 246 పరుగులు చేసి కుప్పకూలింది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్ కు అనుకూలించే ఉప్పల్ పిచ్ పై టీమిండియా స్పిన్నర్లు రెచ్చిపోయారు. దీంతో టీ బ్రేక్ లోపే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (20), డకెట్ (35) శుభారంభం అందించలేకపోయారు.

తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ క్రీజులో నిలబడలేకపోయారు. ఒల్లీ పోప్ (1) నిరాశ పరిచాడు. రూట్ (29), బెయిర్ స్టో (37) కుదురుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో రెహాన్ అహ్మాద్ (13), టోమ్ హార్ట్లే (23), మార్క్ ఉడ్ (11) కొన్ని పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 65 ఓవర్లకు 243 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడూ వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, బుమ్రా తలా రెండు వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ ను కుప్పకూల్చారు.





Updated : 25 Jan 2024 3:45 PM IST
Tags:    
Next Story
Share it
Top